
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి సింగరేణి రెస్క్యూ శిక్షణ
గోదావరిఖని: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) సభ్యులకు సింగరేణి యాజమాన్యం సోమవారం శిక్షణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని 10వ బెటాలియన్‌కు చెందిన మొదటి బ్యాచ్‌కు శిక్షణ ఇస్తున్నారు. భూగర్భగనుల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఒక్కో బ్యాచ్‌కు 14రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకున్న సింగరేణి రెస్క్యూ ద్వారా ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఎన్‌డీఆర్‌ఎఫ్, మినిస్టరీ ఆఫ్ హోం ఎఫైర్స్, డీజీఎంఎస్, సింగరేణి సంస్థ కలిపి ఈనిర్ణయం తీసుకున్నాయి. శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ సంఘటన సమయంలో సింగరేణి రెస్క్యూ బృందాల పనితీరు దేశవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పనిచేయాలనే ఆలోచనతో ఈశిక్షణకు అంకురార్పన జరిపారు. మొదటి బ్యాచ్‌లో 30మంది సభ్యులు ఉంటారని, ఈ బెటాలియన్‌లో 18 బ్యాచ్‌లు ఉంటాయని అసిస్టెంట్ కమాండర్ కె.కిరణ్‌కుమార్ తెలిపారు. ఈశిక్షణను ఆర్జీ–2 జీఎం బండి వెంకటయ్య, ఏరియా సేఫ్టీ జీఎం మధుసూదన్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. 14రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ కొనసాగనుంది.
మొదటి బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభం