
ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచాలన్
కరీంనగర్ టౌన్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో పథ సంచాలన్ నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. టీటీడీ కల్యాణమండపంలో జరిగి న సమావేశానికి తెలంగాణ ప్రాంత కార్యవాహ్ కాచం రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1925న విజయదశమి రోజున ప్రారంభించారని తెలిపారు. ఈ విజయదశమికి 100ఏళ్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ పుట్టిందే మాతభూమి సేవకోసమన్నారు. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా మార్చిందన్నారు. సంఘం నిర్వహించే శాఖపద్ధతి ద్వారా వ్యక్తి నిర్మాణాన్ని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రముఖులు, స్వయం సేవకులు పాల్గొన్నారు.