
బాధితులను కాపాడే ‘కమ్ అలాంగ్’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆపదలో చిక్కిన వారిని కాపాడేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్‌ఎఫ్) సరికొత్త యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీకమ్‌అలాంగ్‌శ్రీ అనే ఈ యంత్రాన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ఇటీవల పంపింది. ఈ యంత్రం వినియోగించే విధానంపై డీఎఫ్‌వో (డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్) శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఫైర్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. పొరపాటున ఎవరైనా బావుల్లో, గోతుల్లో, డ్రైనేజీల్లో, కాలువల్లో పడినపుడు.. మంటల్లో చిక్కుకున్నపుడు ఈ యంత్రం ద్వారా అగ్నిమాపక సిబ్బంది తొలుత లోపలికి దిగుతారు. అనంతరం బాధితులను తాడుకు కట్టి హైడ్రాలిక్ విధానంలో పైకి లాగి రక్షిస్తారు.