
తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సరఫరాను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అప్పగించిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను ఇంజినీరింగ్ అధి కారులు లైన్‌మెన్లు, ఫిట్టర్లతో కలిసి నిత్యం తనిఖీ చేయాలన్నారు. తాగునీటి సరఫరా జరుగుతున్న సమయంలో పర్యవేక్షిస్తేనే సమస్యలుంటే తెలుస్తాయని అన్నారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేసి, లీకేజీలను సరిచేయాలని సూచించారు. నగరంలో స్మార్ట్‌సిటీ, వివిధ గ్రాంట్ల ద్వారా చేపట్టిన పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు టైమ్‌లైన్, టెండర్ ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈలు ఓం ప్రకాశ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.