
శమీపూజ.. రాంలీల
జిల్లావ్యాప్తంగా గురువారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లో, పట్టణాల్లో పండుగ సందర్భంగా సందడి నెలకొంది. ఆలయాల్లో రద్దీ నెలకొనగా.. శమీపూజలు నిర్వహించారు. జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సాయంత్రం రాంలీల వేడుకలు వైభవంగా సాగాయి. ఊరూరా రావణ సంహార కార్యక్రమం ఆకట్టుకుంది. కరీంనగర్‌లోని పలు ఆలయాల్లో శమీ, వాహన పూజలు, రామ్‌లీల కార్యక్రమాలతో సందడి నెలకొంది. చైతన్యపురిలో మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కోతిరాంపూర్‌లోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శమీపూజల్లో పాల్గొన్నారు. మార్క్‌ఫెడ్ మైదానంలో జరిగిన రాంలీల కార్యక్రమంలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మాజీ మేయర్ సునీల్‌రావు శమీ పూజల్లో పాల్గొన్నారు. రామడుగు మండలం వెదిరలో శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల రథయాత్ర వైభవంగా సాగింది. అనంతరం శమీపూజ నిర్వహించారు. – కరీంనగర్ కల్చరల్

శమీపూజ.. రాంలీల

శమీపూజ.. రాంలీల

శమీపూజ.. రాంలీల

శమీపూజ.. రాంలీల