
లోకల్ కిక్కు
దసరా మద్యం విక్రయాలు రూ.46.37 కోట్లు
గతేడాది కన్నా రూ.13 కోట్లు అధికం
పండుగ, స్థానిక ఎన్నికల నేపథ్యంలో జోరుగా అమ్మకాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
దసరా అంటేనే మందు, మటన్‌తో దావత్ చేసుకోవడం. పండక్కి మద్యం ప్రియులు ఫుల్లుగా తాగేశారు. జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 42,251 లిక్కర్ బాక్సులు, 80,170 బాక్సుల బీర్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ దాదాపు రూ.46.37కోట్లు ఉంటుంది. గతేడాది దసరాకు రూ.32కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది విక్రయాలతో పోలిస్తే సుమా రు రూ.13కోట్ల పైచిలుకు అదనంగా సేల్స్ అయినట్లు ఎకై ్సజ్ అధికారులు చెప్పుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే రికార్డుస్థాయిలో రూ.46.37 కోట్ల విక్రయాలు జరిగాయి. గత దశాబ్దకాలంలో మద్యం విక్రయాలు ఈస్థాయిలో జరగడం రికార్డేనని లిక్కర్ వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు.
విక్రయాలకు కారణం
విక్రయాలు పెరగడానికి ప్రధాన కారణాలు గాంధీజయంతి రోజున దసరా రావడటం. దీంతో చాలా మంది ముందస్తుగానే అవసరానికి మించి లిక్కర్‌ను కొనిపెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారుకావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు పండుగ సందర్భంగా పలు పల్లెల్లో లిక్కర్‌ను సరఫరా చేశారు. కుల సంఘాల వారీగా తమ కు అనుకూలమైన వారికి మద్యం బాటిళ్లు పంపిణీ చేసి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేయటం సైతం సేల్స్ పెరిగేందుకు దోహదం చేశాయి.
పెరిగిన మాంసం అమ్మకాలు
గాంధీజయంతి రోజున దసరా రావడంతో చాలా గ్రామాల్లో ముందు రోజునే మటన్ కొని పెట్టుకున్నారు. మరికొన్ని చోట్ల దసరా పండుగ రోజు ఉద యం 4గంటలలోపే మటన్ విక్రయాలు జరిపారు. ఈ ఏడాది మాంసం విక్రయాలు గతం కన్నా ఎక్కువగానే జరిగినట్లు మటన్‌షాపు నిర్వాహకులు చెప్పుతున్నారు. మిగితా రోజులతో పోలిస్తే దసరా రోజున జిల్లావ్యాప్తంగా రూ.కోటికి పైనే మాంసం విక్రయించినట్లు సమాచారం. నూతన వాహనాల కొనుగోళ్లు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగా యి. పండుగ పూట కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారితో టూవీలర్, ఫోర్ వీలర్స్ షోరూంలు కళకళలాడాయి. శుక్రవారం సైతం మద్యం దుకాణా లు, మటన్, చికెన్ సెంటర్ల వద్ద సందడి కనిపించింది. లిక్కర్ బిజినెస్ మరింత పెరిగే అవకాశముంది.