
రాంలీలా.. గోలగోల
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దసరా సందర్భంగా నగరంలోని మార్క్‌ఫెడ్ మైదానంలో నిర్వహించిన రాంలీలా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. గురువారం రాత్రి మైదా నంలో ఏర్పాటు చేసిన శమీపూజకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆర్‌టీఏ సభ్యుడు పడాల రా హుల్ తదితరులతో కలిసి హాజరయ్యారు. శమీ పూజ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ శ్రేణులు ‘జై గంగుల.. జైజై గంగుల’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు సైతం ‘జై పొన్నం.. జైజై పొన్నం’ అనడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తున్న వారి ని పోలీసులు వారించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయాలకు తావు లేదని, నేతల అనుకూల నినాదాలు అవసరం లేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. శమిపూజ అనంతరం కార్యక్రమాన్ని సుడా చైర్మన్ కొనసాగిస్తారని చెప్పి పొన్నం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడకు చేరుకొన్నారు. రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జై గంగుల అంటే తొక్కుతారా:
పోలీసులపై గంగుల ఫైర్
‘జై గంగుల అంటే తొక్కుతా అన్నవ్ కదా...తొక్కు మరి..చంపుతవా చంపు’ అంటూ గంగుల కమలాకర్ పోలీసులపై ఫైర్ అయ్యారు. రాజకీయ నినాదాలు చేస్తుంటే వారించామని పోలీసులు చెప్పగా, జై పొన్నం..జై గంగుల...అంటున్నరు...ఇందులో పార్టీలేడున్నయని ఆగ్రహించారు. గవర్నమెంట్ పర్మినెంట్ ఉంటదా... మినిస్టర్ పర్మినెంట్ ఉంటడాఅంటూ మండిపడ్డారు.