
ఘనంగా సుందరేశ్వర దుర్గాభవానీల పట్టాభిషేకం
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ ఆలయంలో శరన్నవరాత్రుల చివరి రోజైన ఽశుక్రవారం అమ్మవారు అర్ధనారేశ్వర అలంకరణలో నంది, సింహవాహనాలపై దర్శనమిచ్చారు. సుందరేశ్వరుల, దుర్గాభవానీల పట్టాభిషేకం, రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కుమార్, వై.సునీల్‌రావు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి చీరసారె పెట్టి ఒడిబియ్యం పోశారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.