
కాలువ నీటిలో దిగి ఊపిరాడక రైతు మృతి
రామడుగు(చొప్పదండి): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు గడ్డం శ్రీనివాస్ (52) గ్రావిటి కాలువలో కరెంటు మోటారు మరమ్మతు కోసం నీటిలోకి దిగి ఊపిరి ఆడక మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రావిటి కాలువలో అమర్చుకున్న కరెంటు మోటారు ఆన్ చేయడానికి మంగళవారం మధ్యాహ్నం గడ్డం శ్రీనివాస్ వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కరెంట్ మోటార్ వద్దకు వెళ్లి చూడగ, గట్టుపైన సెల్‌ఫోన్‌తో పాటు దుస్తులను గమనించారు. విద్యుత్ మోటారు పైపు విప్పి ఉండడంతో కాలువలో మునిగి ఉంటాడని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించారు. బుధవారం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు పైన కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి
హుజూరాబాద్: పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ షాక్‌తో ఉద్యోగి మృతిచెందిన ఘటన బుధవారం హుజూరాబాద్‌లో జరిగింది. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి(40) బోర్నపల్లిలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ఆర్టిజన్ గ్రేడ్–2 అసిస్టెంట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యుత్తు మరమ్మతులలో భాగంగా స్తంభంపై ఎక్కిన క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య స్వాతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు.

కాలువ నీటిలో దిగి ఊపిరాడక రైతు మృతి