
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కుర్‌లో విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. లింగంపల్లి రాజేశ్(22) గత నెల 28న ఇంటి వద్ద బట్టలు ఆరేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
మహిళ ఆత్మహత్య
చిగురుమామిడి: మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన నక్క లచ్చవ్వ (50) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలి పారు. పనినిమిత్తం వెళ్లొచ్చేసరికి కనిపించలేదని, బుధవారం ఉదయం ఉరేసుకొని కనిపించినట్లు లచ్చవ్వ భర్త కొంరయ్య పోలీసులకు తెలిపారు. కొంరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ పేర్కొన్నారు.