
ఆధార్ సవరణలకు కొత్త చార్జీలు
జ్యోతినగర్(రామగుండం): యూనిక్ ఐడెంటీఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇకనుంచి ఆధార్‌లో సవరణకు కొత్తచార్జీలు అమలు చేయనుంది. పెంచిన చార్జీలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయి. కొత్త కార్డుల జారీ సేవలు ఉచితంగానే అందిస్తారు. కానీ, జారీచేసిన ఆధార్‌కార్డుల్లో అడ్రస్ మార్పు, వయసు సవరణ, వేలిముద్రల అప్‌డేట్ తదితర సేవలకు చార్జీలను విడతల వారీగా పెంచుతోంది. తొలివిడతలో పెంచిన చార్జీలు ఈనెల 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నారు. 17 ఏళ్ల వయసు దాటినవారు తమ ఆధార్‌లో వేలిముద్రలను అప్‌డేట్ చేసుకునేందుకు ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తున్నారు. తాజాగా దీనిని రూ.125కు పెంచారు. అడ్రస్ మార్చుకునేందుకు ప్రస్తుతం రూ.50 వసూలు చేస్తుండగా తాజాగా రూ.75కు పెంచుతున్నారు. ఆధార్‌కార్డు కలర్ ప్రింట్ కోసం రూ.40 వసూలు చేస్తుండగా.. ఇకనుంచి మరింత పెంచుతారు.
యూఐడీఐఏ ఆధార్ అప్‌డేట్‌లో కొత్త చార్జీలు నిర్ణయించింది. ఈనెల 1వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. ప్రజలు కొత్త చార్జీలను గమనించి ఆధార్ నిర్వాహకులకు సహకరించాలి.
– పల్లె బాపు, మేనేజర్, మీసేవ, ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు
నేటినుంచి అమలు

ఆధార్ సవరణలకు కొత్త చార్జీలు