
పంపిణీకి సిద్ధంగా ‘దీపిక’ పుస్తకాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): రాష్ట్ర విద్యా పరిశోధన, అభివృద్ధి శిక్షణ సంస్థ ముద్రించిన అభ్యాస దీపికలు జిల్లా కేంద్ర గోదం నుంచి ఎమ్మార్సీలకు చేరాయి. దసరా సెలువుల తర్వాత వీటిని పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాదికన్నా ఈసారి మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా వీటిని పంపిణీ చేయాలన్నదే లక్ష్యం.
సులభంగా అర్థమయ్యేలా..
పదో తరగతి విద్యార్థులకు అభ్యాసన కరదీపికలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని డీఈవో మాధవి తెలిపార. ఎమ్మార్సీల నుంచి పాఠశాలలకు చేరనున్నాయని వివరించారు. వీటి ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని అన్నారు. తద్వారా ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.