
గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన నర్ర హరీశ్, పట్టణంలోని మోతెమాలవాడకు చెందిన దమ్మ ఉదయ్‌కిరణ్ డిగ్రీ కళాశాల సమీపంలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణ ఎస్సై రవికిరణ్ వారిని పట్టుకుని తనిఖీ చేయగా 250 గ్రాముల గంజాయి లభ్యమైంది. ఇద్దరిసౌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో జీపీ సిబ్బందికి గాయాలు
శంకరపట్నం: మండలంలోని వంకాయగూడెంలో విద్యుత్‌షాక్‌తో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న చలిగంటి సురేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గ్రామపంచాయతీ పక్కన మినీ ట్రాన్స్‌పార్మర్‌ను బంద్‌చేసి వీధిలైట్లు వేసిన సురేశ్ మరో వీధిలో వీధిలైట్లు వేసేందుకు ట్రాక్టర్ ట్రైలర్ ఎక్కి విద్యుత్ బల్బు అమర్చుతుండగా విద్యుత్‌షాక్‌కు తగిలి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను కారులో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్‌షాక్‌కు గురైన విషయాన్ని ఎంపీడీవో, ఎంపీవో, డీపీవోకు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతు న్న వారు పరీక్షల్లో ప్రతిభ చూపితే.. ఏటా ఉపకారవేతనాలు అందిస్తోంది. ప్రతీనెల రూ.వె య్యి చొప్పున సాయం చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష కోసం ప్రకటన వెలువడింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలె, ప్రభుత్వ ఎయిడెడ్, వసతీసౌకర్యం లేనిఆదర్శ స్కూళ్ల విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం హన్మాజీపేటలో సోమవారం ఉదయం ఆటో బోల్తాపడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాలపల్లికి చెందిన సాయిలు తన ఆటోలో మహిళలను ఎక్కించుకుని జగిత్యాలకు వస్తున్నాడు. హన్మాజీపేట వద్ద ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పొరండ్లకు చెందిన నక్క గంగవ్వ, తోట గంగు, మెడపట్ల లక్ష్మీ, సాయిలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంపై కేసు
● రూ.13.50 లక్షలకు పైగా నష్టం
● పోలీసుల అదుపులో నిందితుడు ?
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మగనర్ హుమెరా ఇండస్ట్రీస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి మంటలు అంటుకోగా ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ కవర్ మెటీరియల్, ఒక బైకు, డీజిల్ జనరేటర్‌తోపాటు వివిధ వస్తువులు కాలిపోయాయి. దాదాపు రూ.13.50లక్షలకు పైగా విలువైన సామగ్రి కాలిపోయినట్లు షాపు యజమాని హఫీజ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అడిషినల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానితునికి, షాపు యాజమాన్యానికి మధ్య గొడవ జరగడంతో ఆదివారం ఎవరూ లేని సమయంలో నిప్పు పెట్టినట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఇండస్ట్రియల్, ఫైర్ అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారు.