తంగేడు పూసింది
– నేటి నుంచి పూల జాతర
– బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు
– ఎంగిలిపూలతో వేడుకలు ప్రారంభం
30ఎస్‌ఆర్‌ఎల్301,302,303,304) బతుకమ్మ సంబరాల దృశ్యాలు (పాత చిత్రాలు)
––––––––––––––––––––––––––––––––––––
చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.
– కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల
––––––––––––––––––––––––––––––––––––
వీధులు.. పూల వనాలు
రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో..
సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని పాడుకుంటూ ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు పెద్ద పండుగ. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలుగా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరివిగా పూసే గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింటా వంటి పూలతో సిబ్బిలో కళాత్మకంగా బతుకమ్మను పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. గౌరమ్మకు మొక్కి చల్లంగా చూడమని వేడుకోనున్నారు.
––––––––––––––––––––––––––––––––––––
ఆడపడుచుల వేడుక
బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.
––––––––––––––––––––––––––––––––––––
కనిపించని గునుగు
గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. గునుగు పువ్వు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో అక్కడక్కడా కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్‌లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. ఇప్పుడు గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.
––––––––––––––––––––––––––––––––––––
రాజన్న పాట వినాల్సిందే
20ఎస్‌ఆర్‌ఎల్226: రేపాక గ్రామానికి చెందిన మీసాల రాజయ్య
ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుకమ్మ పాటల స్పెషలిస్ట్. తెలంగాణ సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేటికాలంలో మహిళలు బతుకమ్మను వదిలిపెడుతున్నారు. ఇలాంటి తరుణంలో రాజయ్య గళంలో బతుకమ్మ పాటల తోట ఉంటోంది. మహిళలకన్నా మధురంగా బతుకమ్మ పాటలు పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. తన సొంత గ్రామంలో బతుకమ్మ పాట పాడుతూ.. బతుకమ్మ పాట రాజయ్యగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
––––––––––––––––––––––––––––––––––––
60 ఏళ్లనుంచి ఆడుతున్న
మల్యాల: నా పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో రోజు బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. బతుకమ్మ పండుగ నాటికి పూలు పూసేలా పెరట్ల రంగు రంగుల బంతిపూల మొక్కలు, పట్టుకుచ్చుల మొక్కలు పెట్టేవాళ్లం. బతుకమ్మ పండుగకు పూలు కోసుకువచ్చే దాన్ని. తీరొక్కపూలతో పెద్దగా పేర్చేవాళ్లం. పనికి పోయి వచ్చిన తర్వాత వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది.
– ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల(20సీపీడీ205)
––––––––––––––––––––––––––––––––––––
సీ్త్ర అస్తిత్వానికి అద్దం
ఫెర్టిలైజర్‌సిటీ: బతుకమ్మ పండుగ సీ్త్రల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ పాటలో సీ్త్రల జీవనశైలి, కుటుంబ అనుబంధాలను చాటుతుంది. బతుకమ్మ పాటలు గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల బంధాలను చూపుతుంది. మారుతున్న కాలంతో పాటు బతుకమ్మ పండుగ కొత్త రూపు సంతరించుకుంది. నేటి యువతరం దాండియా ఆటలు, కోలాటలు, డీజే పాటలతో బతుకమ్మ పండుగ ప్రసిద్ధిని మరుగున పడేలా చేస్తున్నారు.
– తాళ్ల లక్ష్మి, గృహిణి, గోదావరిఖని(20జీడీకే151)
––––––––––––––––––––––––––––––––––––
నుదుటి సిందూరం
పండుగల్లో ముఖ్యమైది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత.
– వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ (20కెఎన్‌టి76)
విభిన్నం బతుకమ్మ
ఆడపడుచుల వేడుక
బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.
వీధులు.. పూల వనాలు
రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు.
కనిపించని గునుగు
గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్‌లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.
రాజన్న పాట వినాల్సిందే
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్. మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు.
60 ఏళ్లనుంచి ఆడుతున్న
మల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది.
– ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల
నుదుటి సిందూరం
పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ,
సాయినగర్, కరీంనగర్
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీని వాస్‌నగర్, రాఘవాపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.
1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ
2వ రోజు అటుకుల బతుకమ్మ
3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ
4వ రోజు నానే బియ్యం
5వ రోజు అట్ల బతుకమ్మ
6వ రోజు అలిగిన బతుకమ్మ
7వ రోజు వేపకాయ బతుకమ్మ
8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ
9వ రోజు సద్దుల బతుకమ్మ
చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.
– కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల
గునుగు నవ్వింది
గునుగు నవ్వింది
గునుగు నవ్వింది
గునుగు నవ్వింది
గునుగు నవ్వింది