
నాలాకు మరమ్మతు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కాశ్మీర్‌గడ్డలో కూలిన నాలాకు నగరపాలకసంస్థ మరమ్మతులు చేపట్టింది. నాలా ఇటీవల కురిసిన వర్షాలకు ఈ నెల 17వ తేదీన కూలడం తెలిసిందే. దీనిపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో, నగరపాలకసంస్థ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. శనివారం జేసీబీతో నాలాలో కూలిన వ్యర్థాలను తొలగించారు.
పనులు నాణ్యతతో చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: జంక్షన్ పనులు నా ణ్యతతో చేపట్టాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ముందున్న జ్యోతి బాపూలే జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. సుడా నిధులు రూ.15 లక్షలతో జ్యోతి బాపూలే జంక్షన్ ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాల ని, వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీని ఆదేశించారు.
రన్నరప్‌గా కరీంనగర్
కొత్తపల్లి(కరీంనగర్): వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్ సర్కిల్ బ్యాడ్మింటన్, చెస్ టోర్నీలో కరీంనగర్ క్రీడాకారులు సత్తా చాటా రు. బాడ్మింటన్ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా టీజీ ఎన్‌పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్‌కో నుంచి 27 జట్లు పాల్గొనగా కరీంనగర్ జట్టు రెండోస్థానం కై వసం చేసుకుంది. చెస్ టోర్నీలో 15 జట్లు పాల్గొనగా కరీంనగర్ టీజీఎన్‌పీడీసీఎల్ జట్టు రెండోస్థానంలో నిలిచింది. శనివా రం సంస్థ డైరెక్టర్(గ్రిడ్ అండ్ మేనేజ్‌మెంట్) జి.సంపత్‌కుమార్ చేతుల మీదుగా కరీంనగర్ జట్ల క్రీడాకారులు బహుమతులను అందుకున్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున బ్యాడ్మింటన్ జట్టుకు పి.రామ్మోహన్‌రావు, సీహెచ్ సంపత్, జి.శ్రీనివాస్, షేక్ అమ్మద్, బి.శ్రీకాంత్, పి.రోహిత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. చెస్ టోర్నీలో ఎం.నాగరాజు, ఎం.ఇంద్రకిరణ్, శ్రీకాంత్, ఎస్.రాజకుమార్, రాజు పాల్గొన్నారు. ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, డీఈ లు కె.ఉపేందర్, రాజం అభినందించారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
సప్తగిరికాలనీ(కరీంనగర్): బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలన్నారు. బాలలకు స్వే చ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలన్నారు.

నాలాకు మరమ్మతు

నాలాకు మరమ్మతు

నాలాకు మరమ్మతు