కరీంనగర్‌క్రైం: ఆర్థిక నేరాలపై సీపీ గౌస్ ఆలం సమీ క్ష నిర్వహించారు. జిల్లాలోని అక్షర చిట్‌ఫండ్, క్రిప్టోకరెన్సీ కేసులతో సహా అన్ని ఆర్థిక నేరాలపై సమీక్షించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. నిందితులకు శిక్ష పడటంతో పాటు బాధితులకు సొమ్ము తిరిగి ఇప్పించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్‌కుమార్, శ్రీనివాస్ జీ, వేణుగోపాల్ పాల్గొన్నారు.
సైబర్ నేరాలను అరికట్టాలి
సైబర్‌నేరాలను అరికట్టేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక సైబర్ వారియర్‌ను నియమించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సైబర్ వారియర్లతో సమావేశం అ య్యారు. సైబర్ నేరాల నియంత్రణలో సైబర్ వారి యర్లదే కీలక పాత్ర అన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే అపరిచిత లింక్‌లు, ఫిషింగ్ మెసేజ్‌లు, గుర్తు తెలియని ఏపీకే ఫైళ్లతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫున సైబర్ వారియర్‌కు జారీ చేసిన ప్రత్యేక టీషర్టులను అందించారు. డీఎస్పీ కోత్వాల్ రమేశ్, సీఐలు సునీల్‌కుమార్, సరిలాల్ పాల్గొన్నారు.
నిందితులకు శిక్షపడేలా కృషిచేయాలి
వివిధ నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా సమన్వయం చేసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. నిందితులకు శిక్షలుపడే శాతాన్ని పెంచేందుకు పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.