
దసరాకు రిలీజ్
న్యూస్‌రీల్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో
శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లైనా పార్టీ పదవుల కోసం వేచి చూస్తు న్న వారికి లక్ష్యం చేరువైంది. దసరా పండుగ కానుకగా, కాస్త అటూ ఇటుగా జిల్లా, మండల కమిటీలను పీసీసీ ప్రకటించనుంది. ఇప్పటికే జిల్లా, మండల కమిటీల ముసాయిదా జాబితాను డీసీసీలు పీసీసీకి పంపించాయి. తుది జాబితాకు ఆమోద ముద్ర వేసి పీసీసీ ప్రకటించడమే మిగిలింది.
కమిటీ ఇలా
రానున్న రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లకు అధికారాన్ని కట్టబెట్టే ఆలోచనతో ఉన్న ఏఐసీసీ కమిటీల కూర్పును పగడ్బందీగా చేపడుతోంది. కమిటీలో పదవుల సంఖ్యతో పాటు, ఏ ఏరియా నుంచి ఎంతమందిని తీసుకోవాలో కూడా నిర్ధేశించింది. డీసీసీ కార్యవర్గంలో ఒక జిల్లా అధ్యక్ష, ఒక కోశాధికారి పదవితో పాటు, ప్రతీఅసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఉపాధ్యక్ష, ఒక అధికార ప్రతినిధి, ఒక కార్యదర్శి పదవిని కేటాయించారు. జిల్లాలోని అన్ని మండలాలకు జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది.
పీసీసీకి ముసాయిదా జాబితా...
జిల్లా కార్యవర్గంతో పాటు, మండల కమిటీలకు సంబంధించిన ముసాయిదా ఇప్పటికే పీసీసీకి చేరింది. గతంలో పార్టీ సంస్థాగత ఇన్‌చార్జీల ద్వారా ఆయా పోస్టులను ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను పార్టీ సేకరించడం తెలిసిందే. వీటితో పాటు సంబంధిత రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఇతర ముఖ్యనేతల సూచనలతో ఆయా డీసీసీ, మండల కమిటీల ముసాయిదా జాబితా రూపొందించి, పీసీసీకి పంపించారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు ఉన్నాయి. మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌లతో పాటు రెండు మండలాలకు సంబంధించి మంత్రి పొన్నం కార్యాలయం పేర్లను పర్యవేక్షించనుంది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల డీసీసీలపై రాష్ట్రమంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో చర్చించి ఆయా జిల్లాల ముసాయిదాను రూపొందించి, పీసీసీకి పంపించారు. కరీంనగర్ జాబితాను డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నగరకాంగ్రెస్ కమిటీ అధక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు ఇటీవల టీపీసీసీ చీఫ్‌కు అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యంతో పార్టీ కమిటీలపై కదలిక వచ్చింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని భావించినప్పటికి, బీసీ రిజర్వేషన్ ఇతరత్రా కారణాలతో జాప్యంనెలకొంది. ఆ లోగా సంస్థాగత నిర్మాణంతో పార్టీని బలోపేతం చేయడంపై పీసీసీ దృష్టి సారించింది. జిల్లా, మండల, గ్రామ కమిటీలను ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని, తద్వారా సంస్థాగత ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందనే ఆలోచనతో పీసీసీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అందిన ముసాయిదా జాబితాలకు తుది రూపు ఇచ్చి, గాంధీ భవన్ దసరా పండుగ నాటికి జాబితాను విడుదల చేయనుంది. మొత్తానికి పార్టీ శ్రేణులకు పండుగ కానుక ఇచ్చేందుకు పీసీసీ సమాయత్తమైంది.

దసరాకు రిలీజ్