
‘దివ్యదృష్టి’కి జాతీయ గుర్తింపు
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ దివ్యదృషి విద్యార్థులు అద్భుతంగా పాటలు పాడి జాతీయస్థాయిలో గుర్తింపు సాధించారని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ భవనంలో శుక్రవారం దివ్యదృష్టి బృందాన్ని సన్మానించి మాట్లాడారు. కరీంనగర్ గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు 16 మంది దివ్యదృష్టి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున నగదు, కొత్త బట్ట లు పంపిణీ చేశారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీగౌతమ్, సాహితి గౌతమ్, అధ్యక్షుడు నంది శ్రీనివాస్, కొత్త అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
పారదర్శకంగా బిల్లింగ్
కొత్తపల్లి(కరీంనగర్): హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులకు బిల్లుల అందజేతలో వేగం, పారదర్శకతను పెంచేందుకు ‘ఆటోమేటిక్’ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) వ్యవస్థను రూపొందించామని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ ఎస్‌ఈ మేక రమేశ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు మాన్యువల్ బిల్లింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) దోహదపడుతుందని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ సిస్టం విద్యుత్ వినియోగాన్ని కొలిచే ఏఎంఆర్ సాధనంలో 4జీ కమ్యూనికేషన్ సిమ్ ఉంటుందన్నారు.