
గుండ్లపల్లిలో యూరియా టోకెన్ల కోసం క్యూలో రైతులు
నిరీక్షణ
గన్నేరువరం/చిగురుమామిడి: యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. గన్నేరువరం గుండ్లపల్లిలో యూరియా టోకెన్ల కోసం సోమవారం ఎరువుల దుకాణం వద్ద క్యూ కట్టారు. 230బస్తాలకు టోకెట్లు ఇచ్చి, యూరియా పంపిణీ చేశారు. 70 మంది రైతులకు నిరాశే మిగిలింది. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. 500 యూరియా బస్తాలు రాగా, వెయ్యి మంది రైతులు క్యూలో నిల్చున్నారు. తిమ్మాపూర్ సీఐ సదన్‌కుమార్, చిగురుమామిడి ఎస్సై సాయికృష్ణ పర్యవేక్షణలో టోకెన్లు జారీ చేసి, యూరియా పంపిణీ చేశారు. బస్తాలు అందనివారు నిరాశతో వెనుదిరిగారు.
నిరసన
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయకుంటే గద్దె దింపుతామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు శ్రీనివాస్ హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం వృద్ధులు, దివ్యాంగులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఇచ్చిన హమీలు అమలు చేయకుండా సర్కారు దగా చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు.
నిర్లక్ష్యం
మానకొండూర్/కరీంనగర్ రూరల్: మానకొండూర్ చెరువు వద్ద వినాయక నిమజ్జన తరువాత చెత్త పేరుకుపోయింది. చెరువులో విగ్రహాలు తొలగించకపోవడం అధికా రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిమజ్జనం అనంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విగ్రహా ల ఇనుము తీసుకెళ్లి, ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలు అక్కడే వదిలేశారని స్థానికులు ఆరో పిస్తున్నారు. చెరువులోని చేపలు చనిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ మల్లయ్య చెరువులోనూ వినాయక విగ్రహాలు తొలగించకపోవడంతో నీళ్లు కలుషితమవుతున్నాయి.

మానకొండూర్ చెరువు ప్రాంతంలో పేరుకుపోయిన వ్యర్థాలు

కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు