
వినతుల జాతర
పట్టా రద్దు చేయండి
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వినతుల తాకిడి పెరుగుతోంది. ప్రతీ సోమవారం సంఖ్య పెరగడమే తప్పా తగ్గడం లేదు. వివిధ రకాల సమస్యలతో వందలాది మంది ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాల కోసం అధికారులకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.
మొత్తం అర్జీలు: 300
మున్సిపల్ కార్పొరేషన్: 60
మానకొండూర్ తహసీల్దార్: 15
డీపీవో: 13, సీపీ ఆఫీస్: 12
ఆర్డీవో కరీంనగర్: 10
తహసీల్దార్ గంగాధర: 10
గ్రామంలో 244/ఎ/1 లో 21గుంటల సాగు భూమి ఉంది. వారసత్వంగా మా తండ్రికి రాగా సదరు భూమిని నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ముందే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా.. రిజిస్ట్రేషన్ చేశారు. అధికారులు వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయాలి.
– తిరుపతి, గద్దపాక, శంకరపట్నం

వినతుల జాతర