కరీంనగర్ కల్చరల్: మహమ్మద్ ప్రవక్త 1500 వ జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీని సోమవారం నగరంలో ముస్లింలు ఘ నంగా నిర్వహించారు. హుస్సేనీపురలోని బొంబాయి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, డీఎఫ్‌వోచౌరస్తా, గీతాభవన్, బస్టాండ్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రాజీవ్‌చౌక్ కరీ ముల్లాషా దర్గాకు చేరింది. సీపీ గౌస్‌ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. తెలంగాణచౌక్‌లో కలెక్టర్ పమేలా సత్పతి ర్యాలీలో పాల్గొన్నారు. ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి హాజరయ్యారు.
కొత్తపల్లి: సర్వీసుల డీటీఆర్‌లకు ఫీడర్ల అనుసంధానం వందశాతం పూర్తి చేసి మ్యాపింగ్ ఇవ్వాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లో సోమవారం అధికారులతో సమావేశం అయ్యారు. ఫీడర్ల బ్రేకర్లను త్వ రగా పూర్తిచేయాలన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునే వారి దరఖాస్తులను త్వరగా పరిశీలించాలన్నారు. డీఈలు కే.ఉపేందర్, జంపాల రాజం, ఎం.తిరుపతి, పి.చంద్రమౌళి, ఎస్‌ఏఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి, చేప, రొయ్య పిల్లల పంపిణీకి కేటాయించిన రూ.122 కోట్ల నిధులను టెండర్ల పేరుతో కాలయాపన చేయకుండా మత్స్య సోసైటీల అకౌంట్లలో జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం(టీఎంకెఎంకెఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.5000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ప్రతీ సొసైటీకి రూ.10లక్షలు, మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సొసైటీకి, మహిళా మత్స్య సొసైటీకి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందించాలన్నారు. జిల్లా నేతలు వెంకటేశ్, గణేశ్ ఉన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ట్రాన్స్‌కో కరీంనగర్ రీజినల్ కార్యవర్గ ఎన్నికలు జరిగా యి. పవర్ ఇంజినీర్స్ భవన్‌లో సోమవారం యూనియన్ ట్రాన్స్‌కో కంపెనీ అధ్యక్షుడు తులసి రామ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వేంకటేశ్వర్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. యూనియన్ ట్రాన్స్‌కో కరీంనగర్ రీజియన్ అధ్యక్షుడుగా ఎ.సందీప్, సెక్రటరీగా ఎల్.రాహుల్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వి.జగదీశ్, అడిషనల్ సెక్రటరీగా బి.త్రిలోచన్, కోశాధికారిగా వి.సదయ్య ఎన్నికయ్యారు. యూనియన్ కార్యదర్శి బాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇ.నాగరాజు పాల్గొన్నారు.
తిమ్మాపూర్: నూతన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు వాహనాల తనిఖీపై ఉమ్మడి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ పి.పురుషోత్తం అలుగునూర్ చౌరస్తాలో అవగాహన కల్పించారు. వాహనాల పత్రాలు, బీమా, డ్రైవింగ్ లైసెన్స్, భద్రతా ప్రమాణాలను వివరించారు. డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ స్రవంతి పాల్గొన్నారు.
మిలాద్ ఉన్ నబీ వేడుకలు
మిలాద్ ఉన్ నబీ వేడుకలు
మిలాద్ ఉన్ నబీ వేడుకలు
మిలాద్ ఉన్ నబీ వేడుకలు