
13న జాతీయ లోక్ అదాలత్
కరీంనగర్‌క్రైం:ఈనెల 13న జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వెంకటేశ్ తెలిపారు. ఇందులో రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు 2,525, సివిల్ కేసులు 215ల ను గుర్తించి, కక్షిదారులకు నోటీసులు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమపైన ఉన్న కేసులను రాజీద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
నేడు రేషన్ దుకాణాలు బంద్
కరీంనగర్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు అ మలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రేషన్ పంపిణీ బంద్ చేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. 5 నెలల కమీషన్‌ను వెంటనే విడుదల చేసి మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 5న ఒక్కరోజు రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టినట్లు వివరించారు.
జిల్లాస్థాయి క్విజ్ పోటీలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆర్‌ఏఏ క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేలుగా నిలిచి న విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ అధికారి చైతన్య జైనీ బహుమతులు ప్రదానం చేశారు.

13న జాతీయ లోక్ అదాలత్