
ఉత్తమ టీచర్‌గా సత్యనారాయణ
కరీంనగర్: వీణవంక మండలం ఎల్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కె.సత్యనారాయణ(స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్) రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 17 అక్టోబర్ 2002లో ఎస్‌జీటీగా విధుల్లో చేరారు. తరువాత స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. చెల్పూర్ పాఠశాలలో పనిచేసినకాలంలో 36మంది విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీకి ఎంపిక కావడంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారు. 32మంది విద్యార్థులను నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎంపికయ్యేలా కృషి చేయడం పాటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 500కు పెంచారు. ఎల్బాక జెడ్పీహెచ్‌ఎస్‌కు జూలై 2018లో పదోన్నతిపై రాగానే 18మంది విద్యార్థులు ఉన్న సంఖ్యను 73కు పెరిగేలా కృషి చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల నుంచి మరో ఇద్దరు విద్యార్థులను నేషనల్ మీన్స్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యేలా చేశారు. ముగ్గురిని టీఎస్‌ఆర్‌జేసీకి సెలెక్ట్ అయ్యేలా శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలు చేపట్టారు.