
ఈవీఎం గోదాం తనిఖీ
కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.