
పీహెచ్‌సీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ రిజిష్టర్, రికార్డులను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించారు. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి, వారికిస్తున్న మందుల తీరును గమనించారు. ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది పరిశుభ్రతలను పరిశీలించారు. కొత్తపల్లి పీహెచ్‌సీ డాక్టర్ నజీమా సుల్తానా పాల్గొన్నారు.