
రోడ్లే బాగోలేవు.. ఫైన్ ఎందుకు కట్టాలి?
కొత్తపల్లి: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రేకుర్తి వద్ద కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై గుంతలు పడ్డ ప్రాంతంలో బుధవారం కరీంనగర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త నిరసన తెలిపాడు. గుంతలు పడ్డ ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంతో బైఠాయించి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ గారు అంటూ ‘రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా.. అన్నింటికీ ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లే సరిగా లేవు. మరి మీరు నాకెందుకు ఫైన్ వేస్తున్నారు.. మీ భారతీయుడు’ అనే ఫ్లకార్డు ప్రదర్శిస్తూ కోట శ్యామ్‌కుమార్ నిరసన చేపట్టాడు.