
తప్పని నిరీక్షణ
చొప్పదండి/చిగురుమామిడి/శంకరపట్నం/తిమ్మాపూర్: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వేకువజాము నుంచే కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. సోమవారం చొప్పదండి పీఏసీఎస్‌కు 1,120 బస్తాలు రాగా ఈపాస్ యంత్రంలో వివరాలు నమోదు చేసిన అనంతరం రైతుల మొబైల్‌కు ఓటీపీ వచ్చాక పంపిణీ చేశారు. ఈ విధానంతో పంపిణీ ఆలస్యం అవుతోంది. చిగురుమామిడి పీఏసీఎస్‌లో 250 మందికి 500 బస్తాలు అందజేశారు. బస్తాలు దొరకని రైతులు సింగిల్‌విండో ఎదుట కరీంనగర్–హుస్నాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. సీఐ సదన్‌కుమార్, ఎస్సై సాయికృష్ణ రైతులను సముదాయించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ‘గణపతి బొప్పామోరియా.. మాకు కావాలి యూరియా’ అంటూ నినాదాలు చేశారు. ముత్తారంలో మహిళా రైతులు సైతం క్యూకట్టారు. సుమారు 400 మంది క్యూ కట్టడంతో తోపులాడుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ వద్ద ఆదివారం రాత్రి నుంచే క్యూకట్టారు. మన్నెంపల్లి గోదాం వద్ద సైతం రైతులు వర్షంలో తడుస్తూ నిరీక్షించారు.

తప్పని నిరీక్షణ

తప్పని నిరీక్షణ

తప్పని నిరీక్షణ