
సమస్యల వాణి.. పరిష్కరించాలని
కరీంనగర్ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అత్యధికం వచ్చిన ఫిర్యాదులే మళ్లీ మళ్లీ రావడం విశేషం. సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించామని కాగితాల్లో చూపుతుండగా ఆచరణలో మాత్రం విరుద్ధ పరిసి్?థ్త అని అర్జీదారులు వాపోతున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాలు, పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రాగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి చొరవ చూపారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. మొత్తం 269 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వివరించారు. వివరాలు వారి మాటల్లోనే..
మొత్తం అర్జీలు: 269
ఎక్కువగా మునిసిపల్ కమిషనర్: 57
వారఽధి సొసైటీ: 21, డీపీవో: 15
ఆర్డీవో కరీంనగర్: 15
తహసీల్దార్ గంగాధర: 12
తహసీల్దార్ మానకొండూరు: 11
సీపీ ఆఫీస్: 08