
పాస్‌బుక్ ఇవ్వలే
ఆరెపల్లిలో మా అమ్మ పేరున సర్వే నంబర్ 364/ఆ లో 22 గుంటలన్నర ఉండగా, తండ్రి పేరున 365, 366 సర్వే నంబర్లలో 23 గుంటల భూమి ఉంది. సదరు భూమికి సంబంధించి మా పేరున ప్రొసీడింగ్ బి/1259/2020 ఇచ్చారు. కానీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. పాస్‌బుక్ రాలేదు. భూభారతిలో దరఖాస్తు ఇచ్చినా మా సమస్య పరిష్కారం కాలేదు.
– రామచంద్రం, మహేశ్, ఆరెపల్లి, కరీంనగర్
పద్మనగర్ జంక్షన్ పనుల్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎటువంటి వర్క్ స్లిప్ లేకుండా సరైన ఎస్టిమెట్ లేకుండా పనులు చేశారు. సరైన అంచనాలతో అప్రూవల్ తీసుకుని పనులు ప్రారంభించాలి కానీ అవేవీ లేవు. మాధవ కన్‌స్ట్రక్షన్ చేపట్టిన పనులపై అనేక ఫిర్యాదులుండగా మళ్లీ వారికే పనులు అప్పగించడమేంటీ.? పనులకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోండి.
– బండారి వేణు, మాజీ కార్పొరేటర్, కరీంనగర్

పాస్‌బుక్ ఇవ్వలే