
మొన్నటి దాకా మంచి నీరు వచ్చింది
మొన్నటి వరకు నల్లాల ద్వారా మంచినీరు వచ్చింది. ఇప్పుడు మురికినీరు వస్తోంది. ఆ నీటిని తాగుదామంటే మనసు ఒప్పడం లేదు. మా రగుడులో అందరి ఇళ్లలోనూ ఇలాగే రంగుమారి వస్తున్నాయి. ఆ నీళ్లు ఎవ్వరూ తాగడం లేదు. పైపులైన్ లీకేజీ అయిందని అనుకున్నాం. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా మంచినీరు సరఫరా చేయాలి.
– గుగ్గిళ్ల కనకయ్య, రగుడు
ఐదు రోజులుగా నల్లాల ద్వారా రంగు మారిన నీరు వస్తుంది. ఆ నీళ్లు ఎవరూ తాగడం లేదు. అంతకుముందు తెల్లగా వచ్చేవి. వానలు పడ్డప్పటి నుంచి నల్లా నీరు మంచిగా వస్తలేదు. మా తండావాసులు వాటర్ ప్లాంటు వద్దకు వెళ్లి ఫిల్టర్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నారు. అధికారులు నల్లా నీటిని పరిశీలించి వెంటనే మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలి.
– భూక్యా అరుణ, భూక్యాతండా
భారీ వర్షాలతో మధ్యమానేరులోకి వచ్చిన వరదతో నీరు బురదగా మారింది. ఆ నీటిని సిరిసిల్లలోని 120 ఎంఎల్‌డీ శుద్ధి కేంద్రంలో నిత్యం శుద్ధి చేస్తున్నా క్లియర్ కావడం లేదు. క్లోరినేషన్ చేసినా నీరు పరిశుభ్రం కావడం లేదు. ఐదు రోజులపాటు, ఆ నీరు క్లియర్ అయ్యేంత వరకు తాగొద్దు. ఇతర అవసరాలకు వినియోగించుకోవాలి. తప్పనిసరైతే కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
– ఎండీ ముజాహిద్ అన్వర్,
మిషన్ భగీరథ ఈఈ, రాజన్న సిరిసిల్ల

మొన్నటి దాకా మంచి నీరు వచ్చింది