
ప్రపంచం గర్వించే బీమా సంస్థ ఎల్‌ఐసీ
కరీంనగర్: ప్రపంచం గర్వించే అత్యుత్తమ బీమా సంస్థ ఎల్‌ఐసీ అని కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్ అన్నారు. ఎల్‌ఐసీ 69వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం డివిజనల్ కార్యాలయంలో సంస్థ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడం ద్వారా ఎల్‌ఐసీ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందని పేర్కొన్నారు. పేపర్ లెస్ ఆఫీస్ ఏర్పాటు దిశలో డిజిటలైజేషన్ నడుస్తోందని, భవిష్యత్‌లో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గైనకాలజిస్ట్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎల్‌ఐసీ లాంటి నమ్మకమైన సంస్థ మరొకటి లేదన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్, ఆపరేషన్ సింధూర్ ఘటనల్లో అందరికీ ఎల్‌ఐసీ మాత్రమే ఉదారంగా క్లెయిమ్స్ చెల్లించిందని, సామాజిక బాధ్యత ఉన్న ఏకై క బీమా సంస్థ అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, సేల్స్ మేనేజర్ రాజేశ్‌ఖన్నా, రాజనరేందర్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.