మంథని @ సీబీఐ | - | Sakshi
Sakshi News home page

మంథని @ సీబీఐ

Sep 2 2025 6:50 AM | Updated on Sep 2 2025 6:50 AM

మంథని @ సీబీఐ

మంథని @ సీబీఐ

న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులు సీబీఐకి రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఈ కేసులు మంథని ప్రాంతానివే.. రాజకీయాల్లో చర్చనీయాంశం

సాక్షి పెద్దపల్లి: మంథని అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. హైకోర్టు న్యాయవాది గట్టు వా మన్‌రామవు దంపతుల హత్యలు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లీకేజీలు, నాణ్యతా ప్రమాణాలపై సందేహాలతో మంథని పేరు రాష్ట్రంలోనే మార్మోగింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు తెరపైకి రావడం.. తాజాగా ఘోష్‌ కమిటీపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ఈ కేసును సీబీఐకి అప్పగించనున్నట్లు ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. 15రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రెండు కేసులను సీబీఐకి అప్పగించడం, ఆ రెండూ మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినవే కా వడం జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

న్యాయవాద దంపతుల హత్య కేసు..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసు నాలుగేళ్ల క్రితం.. 2021 ఫ్రిబవరి 17న రామగిరి మండలం కల్వచ ర్ల గ్రామ శివారులో జరిగింది. గట్టు వామన్‌రావు, ఆయన భార్య నాగమణిని కొందరు నడీరోడ్డుపై కత్తులతో అత్యంత దారుణంగా హత్యచేశారనే వీడియా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇది లైవ్‌గా ఉండడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులతోపాటు వారికి సహకరించిన ఏడుగురిని పోలీసులు అప్పట్లోనే అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొద్దిరోజుల తర్వాత నిందితులు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. హత్య కేసులో టీఆర్‌ఎస్‌ నేతకు సంబంధం ఉందంటూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలోనే ఆగస్టు 12న కేసును సీబీఐకి అప్పగించి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంథని మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి వచ్చింది.

కాళేశ్వరంతో ఇంకోసారి..

గత ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలోని మంథని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని, దానిని తేల్చేందుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో కమిష న్‌ను వేసింది. తాజాగా కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణకు సీబీఐకు అ ప్పగిస్తూ ప్రస్తుత ప్రభత్వుం నిర్ణయం తీసుకుంది. గత ప్ర భత్వుం 2022లో రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధం విధించగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సీబీఐ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ రెండు కేసులనూ సీబీఐకి అప్పగిస్తుండగా, ఆ రెండు మంథని అసెంబ్లీ నియోజకవర్గంతో సంబంధం ఉండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సీబీఐ ఎంట్రీతో జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనే చర్చసాగుతోంది. ఈ కేసుల ఎఫెక్ట్‌తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని అన్ని రాజకీయ పార్టీల్లోని కార్యకర్తలు ముచ్చటించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement