
భగీరథ బురద నీరు
మండలాలు : 12
మున్సిపాలిటీలు : సిరిసిల్ల, వేములవాడ
ఆవాస ప్రాంతాలు : 359
తాగునీరు పొందే జనాభా : 6 లక్షలు
నల్లాలు : 1,26,766
నిర్మాణ వ్యయం : రూ.1,085 కోట్లు
పైపులైన్ పొడవు :1,263.77 కిలోమీటర్లు
నీళ్ల ట్యాంకులు : 625
పాత నీళ్ల ట్యాంకులు : 378
కొత్తగా నిర్మించినవి : 247
రోజుకు అవసరమైన నీరు : 10 కోట్ల లీటర్లు
వినియోగించే మోటార్లు : 20
అవసరమయ్యే విద్యుత్ : 5.976 మెగావాట్స్
ఆధారం : మధ్యమానేరు జలాశయం
● నల్లాల్లో మురికి నీరు సరఫరా ● మధ్యమానేరు ఫిల్టర్‌బెడ్ చుట్టూ వరదనీరు
● క్లోరినేషన్ చేసినా శుద్ధికాని వైనం ● ఆ నీరు తాగొద్దు.. మిషన్ భగీరథ ఈఈ అన్వర్
ఇది మధ్యమానేరు జలాశయంలోని రుద్రవరం వద్ద ఉన్న ఇన్‌టెక్ వెల్. ఇటీవల వర్షాలు, వరదలతో జలాశయంలో పూర్తి స్థాయిలో 26 టీఎంసీలు నిండింది. ఇన్‌టెక్ వెల్ చుట్టూరా వరదనీరు చేరింది. తెల్లగా తేటగా ఉండాల్సిన మధ్యమానేరు జలాశయం నీరు ఇలా ఎర్రగా బురదరంగులోకి మారింది. ఈ నీటిని పంపింగ్ చేస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా శుద్ధి చేసినా వరదనీటిలోని బురద వీడడం లేదు.