
విద్యుత్‌షాక్‌తో మహిళారైతు దుర్మరణం
● వెల్దుర్తిలో విషాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పెంట రాజవ్వ (60) సోమవారం తన పంట చేను వద్ద విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. రాజవ్వ ఉదయం గ్రామ శివారులోని మొక్కజొన్న చేను వద్ద పిట్టలు కొట్టేందుకు వెళ్లింది. రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి విద్యుత్ వైరు తెగి కిందపడింది. దానిని గమనించకుండా వెళ్లిన రాజవ్వ వైరుపై కాలు పడటంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. రాజవ్వ కుమారుడు పెంట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
చేపల వేటకు వెళ్లి.. కరెంట్ షాక్‌కు గురై..
ధర్మారం(ధర్మపురి): పెదపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన మేకల రవి(50) ఆదివారం రాత్రి చేపలవేటకు వెళ్లి ప్రమాదవాశాత్తు కరెంట్ షాక్‌కు గురై మరణించినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారంగా.. గ్రామ శివారులోని చెరువు మత్తడి వద్ద చేపలు పట్టేందుకు రవి రాత్రి వెళ్లాడు. మత్తడి సమీపంలోని ఓ రైతు కరెంట్ మోటార్ స్టార్టర్ బాక్స్ నుంచి జే వైరును మత్తడి వరకు తీసుకువెళ్లాడు. వైరును నీటిలో వేసి స్టార్టర్ ఆన్‌చేశాడు. అయితే, ప్రమాదవాశాత్తు రవి కుడికాలుకు వైర్‌తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. మృతుడి భార్య సునీత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కరీంపేట మాజీ సర్పంచ్ మృతి
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కరీంపేట మాజీ సర్పంచ్ కేతిరి వెంకట్‌రెడ్డి(70) సోమవారం వేకువజామున మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వెంకట్‌రెడ్డి 3 పర్యాయాలు సర్పంచ్‌గా, ఒకసారి ఎంపీటీసీగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మె కొనసాగుతుండగా సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళి అర్పించారు.

విద్యుత్‌షాక్‌తో మహిళారైతు దుర్మరణం

విద్యుత్‌షాక్‌తో మహిళారైతు దుర్మరణం