
చోరీ కేసును చేధించిన పోలీసులు
ధర్మపురి: ఆగస్టు 30న ధర్మపురికి చెందిన రెడీమేడ్ బట్టల వ్యాపారి కోలేటి మల్లికార్జున్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. చోరీకి పాల్పడింది ఇద్దరు మైనర్లు.. పైగా అన్నదమ్ములుగా గుర్తించారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మల్లికార్జున్ బట్టల వ్యాపారి. ఆగస్టు 30న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. కుటుంబం ఆర్థికంగా లేకపోవడం.. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్ బాలురు(అన్నదమ్ములు) తాళం పగులగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 22.71 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్, రవీందర్ రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. సీసీ పుటేజీలతోపాటు ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. ఇందులో అన్నదమ్ములైన ఇద్దరు బాలురే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22.71 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జగిత్యాలలోని జువైనల్ కోర్టుకు తరలించామన్నారు. 24 గంటల్లోనే కేసును చేధించిన సీఐ, ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి, కానిస్టేబుళ్లు రమేశ్‌నాయక్, రణధీర్‌గౌడ్, ఆరిఫ్, మహేందర్‌ను డీఎస్పీ అభినందించారు.
నిందితులిద్దరూ మైనర్లు.. పైగా అన్నదమ్ములు
పోలీసులను ప్రశంసించిన ఎస్పీ, డీఎస్పీ

చోరీ కేసును చేధించిన పోలీసులు