
బాల భీముడు
● సాధారణ ప్రసవంలో ఆరో సంతానముగా నాలుగుకిలోల శిశువు జననం
మానకొండూర్: మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారులు రెండు సాధారణ ప్రసవాలు చేశారు. అందులో బిహార్‌కు చెందిన ఓ మహిళకు 6వ సంతానంగా 4 కిలోల బరువున్న మగబిడ్డ జన్మించాడు. వివరాలు.. బిహార్‌కు చెందిన అఖిలేశ్, కాజల్‌దేవి దంపతులు కొద్దిరోజులుగా అల్గునూర్ సమీపంలోని కోళ్ల ఫాంలో పని చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఐదుగురు ఆడపిల్లలు సంతానం. గర్భిణి అయిన కాజల్‌దేవికి సోమవారం నొప్పులు రావడంతో మానకొండూర్ పీహెచ్‌సీలో చేర్పించగా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆరో సంతానంగా సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువున్న బాబు పుట్టడంతో ఆశ్చర్యపోతున్నామని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ సల్మాన్ తెలిపారు. మరో కాన్పులో మానకొండూర్‌లో స్వీట్ హౌజ్ నడుపుకుంటున్న రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి కూతురు తార గుర్జార్ మూడున్నర కిలోల మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైధ్యాధికారులు తెలిపారు. సీహెచ్‌వో రాజునాయక్, హెల్త్ సూపర్‌వైజర్ జుబేర్, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
కేశవపట్నం పీహెచ్‌సీలో..
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కేశవపట్నం పీహెచ్‌సీలో సోమవారం పురిటినొప్పులతో బాధడుతున్న మహిళకు వైద్యులు సాధారణ కాన్పు చేశారు. మండల కేంద్రంలో వినాయక విగ్రహాలు తయారు చేసే లలిత్‌సారంగ్‌కు పురిటినొప్పులు రావడంతో పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు శ్రావణ్‌కుమార్, శ్రావణి సాధారణ కాన్పు చేయగా, 3 కిలోల శిశువు జన్మించాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు.