
సీపీఎస్ రద్దుకు ఉద్యమిస్తాం
సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలి. సెప్టెంబర్ 1న ఉద్యోగ, ఉపాధ్యాయులు చీకటి దినంగా భావిస్తూ విధుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలి. – కట్టా రవీంద్రచారి,
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
ఐదేళ్లు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు పెన్షన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం 35ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినవారికి పెన్షన్ లేదనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. పెన్షన్ అనేది భిక్ష కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాలకులు విస్మరించడం బాధకరం. విద్రోహ దినంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు సోదర సంఘాలన్ని పాల్గొనాలి. – దాముక కమలాకర్, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

సీపీఎస్ రద్దుకు ఉద్యమిస్తాం