
గణేశ్ మండపాల్లో చోరీ
బోయినపల్లి: మండలంలోని కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని పలు వినాయక మండపాల్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. కొదురుపాక రోడ్ నంబర్–14 వినాయక మండపంలో రూ.55 వేల విలువ గల ఆంఫ్లీఫైర్, రోడ్ నంబర్–8 మండపంలో ఒక ఆంఫ్లీఫైర్, రెండు సౌండ్‌బాక్స్‌లు, హుండీ, రోడ్‌నంబర్–5 గణేశ్ మండపంలో ఆంప్లీఫైర్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో అపరిచిత వ్యక్తి
బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో ఆదివారం ఉదయం ఓ అపరిచిత వ్యక్తి ఒపెన్ స్లాబ్‌లో పడుకుని ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి గోడ దూకి ఆ ఇంట్లోకి చొరబడ్డట్లు చెప్పారు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా, అతను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు ఎస్సై రమాకాంత్ చెప్పారు. మద్యం మత్తులో వచ్చినట్లు, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.