
నీటి గుంతలో పడి బాలుడు మృతి
జగిత్యాలక్రైం: పాఠశాలకు సెలవు రావడంతో ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు నీటి గుంతలో పడి మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో గురువారం సాయంత్రం జరిగింది. కల్లెడ గ్రామానికి చెందిన కుంట భూమయ్య కుమారుడు కుంట దినేశ్ (7) గ్రామంలో రెండో తరగతి చదువుతున్నాడు. భారీ వర్షం నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. అప్పటికే ఓ జేసీబీ నిర్వాహకుడు రోడ్డుపక్కన భారీ గుంత తవ్వాడు. రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ గుంత పూర్తిస్థాయిలో నిండి నీటి ప్రవాహం వెళ్తోంది. దినేశ్‌తోపాటు మరో ముగ్గురు చిన్నారులు కూడా నీటిలో ఆడుకుంటూ అటువైపు వెళ్లారు. దినేశ్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. స్థానికులు వచ్చి బాలుడి కోసం వెదకగా బాలుడు మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు.
జేసీబీ నిర్వాహకుడి నిర్వాకంతోనే ప్రమాదం
కల్లెడ శివారులోని ప్రభుత్వ భూముల్లో కొద్దికాలంగా ఓ జే సీబీ నిర్వాహకుడు మైనింగ్, రె వెన్యూ అనుమతి లేకుండా ప్ర తిరోజు కూలీలతో బండరాళ్లు కొట్టించడంతోపాటు మట్టిని తోడుతున్నట్లు సమాచారం. మట్టికోసం భా రీ గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలిపెట్టాడు. భారీ వర్షాలకు ఇటీవల ఆ గుంతలు నిండాయి. అటువై పు వెళ్లిన పశువులు ఆ గోతుల్లో ప్రమాదవశాత్తు ప డి మృతిచెందాయి. సదరు జేఏసీ నిర్వాహకుడు రెండుమూడేళ్లుగా ప్రభుత్వ స్థలాలు, గుట్టల్లో బండరా ళ్లు తీసుకెళ్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతికి గుంత తీసిన జేసీబీ నిర్వాహకుడే కారణమని, అతనిపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.