
కాలువలో పడి యువకుడి మృతి
ఇల్లందకుంట(హుజూరాబాద్): మండలంలోని మల్యాలకు చెందిన చందగల్ల రాజు (32) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాలు... వ్యవసాయ పొలం వద్దకు వెళ్లొస్తానని మంగళవారం సాయంత్రం ఇంట్లో చెప్పి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. బుధవారం కనగర్తి గ్రామం నుంచి మల్యాల చెరువుకు వచ్చే కాలువలో రాజు మృతదేహాన్ని చూసినవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య కవిత, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
వ్యవసాయ బావిలో పడి ఆరోగ్య మిత్ర..
మానకొండూర్: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఆరోగ్య మిత్ర గాలిపల్లి ఆంజనేయులు(40) వ్యవసాయ బావిలోపడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు..ఆంజనేయులు కరీంనగర్‌లో ఆరోగ్య మిత్రగా పనిచేస్తుండగా, భార్య శకుంతల కర్నూల్‌లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటోంది. వీరికి ఇద్దరు కొడుకులు. బుధవారం తెల్ల వారుజామున భార్య వద్దకు వెళ్లామని ఇంటి నుంచి బయలుదేరాడు. జగ్గయ్యపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి పోయాడు. గురువారం వ్యవసాయబావిలో మృతదేహం ఉందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొన్ని మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆంజనేయులు మృతి ప్రమాదమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.