
ఖోఖో సోదరులు
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణం బీసీ కాలనీకి చెందిన వాసం శంకర్–లక్ష్మి దంపతులకు నవీన్, సంజయ్, అజయ్ సంతానం. తల్లిదండ్రులు బీడీలు చుడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు పిల్లలను చదివించారు. నవీన్, సంజయ్ క్రమశిక్షణతో చదవుతో పాటు ఆటల్లో రాణించారు. ఖోఖో ఆటలో జాతీయస్థాయికి చేరుకున్నారు. నవీన్ అంతర్జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో మన దేశం తరఫున ఆడారు. ఇద్దరూ ప్రభుత్వ వ్యాయామ ఉద్యోగాలు సాధించారు.
ఏడో తరగతి నుంచే..
ఏడో తరగతి నుంచే జెడ్పీ హైస్కూల్లో పీఈటీ లక్ష్మీనారాయణ సార్ ప్రోత్సాహంతో ఖోఖో ఆడడం స్టార్ట్ చేశా. నిరంతరం సాధన చేస్తూ జోనల్ లెవెల్, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గోల్డ్ మెడల్ సాధించా. డిఫెన్స్‌లో స్పోర్ట్స్ కోటలో ఉద్యోగం వచ్చింది. తర్వాత పీఈటీగా జెడ్పీహెచ్‌ఎస్ కథలాపూర్‌లో ఉద్యోగం సాధించా. ప్రమోషన్ రాగా భూషన్‌రావుపేటలో పీడీ ఉద్యోగం చేస్తున్నా. – నవీన్
అన్నయ్య స్ఫూర్తితో..
అన్నయ్య నవీన్ స్ఫూర్తితో ఖోఖో ఆటపై ఆసక్తి కలిగింది. మండల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పతకాలు సాధించా. డిగ్రీలో ఎన్‌సీసీబీ సర్టిఫికెట్ పొందాను. రైల్వేలో ఉద్యోగం రాగా పెద్దపల్లి, మెట్‌పల్లి ఏరియా రైల్వే స్టేషన్‌లలో జాబ్ చేశా. తర్వాత మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో పీడీగా జాబ్ వచ్చింది. 2024 డీఎస్సీలో పీడీ, పీఈటీ జాబ్ రాగా మెట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నా. – సంజయ్