
సిబ్బంది అలర్ట్‌గా ఉండాలి
కరీంనగర్ కార్పొరేషన్: భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా వరదనీళ్లు నిలవకుండా చర్యలుతీసుకోవాలని సూచించారు. డీఆర్‌ఎఫ్ బృందాలు షిఫ్ట్‌ల వారీగా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. వరదనీటిని మళ్లించేందుకు జేసీబీ తదితర వాహనాలను ఇంజినీరింగ్ అధికారులు రెడీగా ఉంచుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న యూజీడీ చాంబర్లను గుర్తించి, రిపోర్ట్ ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలను శుభ్రపరుస్తూ, ప్లాస్టిక్ బాటిల్స్, కొబ్బరి బొండాలు, ఇతరత్రా చెత్తను తొలగించాలన్నారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి నీటిని శుభ్రపరుచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించి, అందులో ఎవరూ ఉండకుండా చూడాలన్నారు. మెప్మా సమన్వయంతో నగర వాప్తంగా రోడ్లపై ఉండే నిరాశ్రయులను గుర్తించి, నైట్ షెల్టర్‌కు తరలించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, ఏసీపీలు వేణు, శ్రీధర్, డీఈలు, శానిటేషన్ సూపర్ వైజర్లు, డిజాస్టర్ అధికారులు ఏఈలు, టీపీఎస్‌లు, టీపీబీఓలు,శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.