
విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి
● టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
కొత్తపల్లి(కరీంనగర్): భారీ వర్షాలు, వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా, విద్యుత్ సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సెలవుపై వెళ్లకూడదని ఆదేశించారు. కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం లోడ్ మానటరింగ్ సెల్ (కంట్రోల్ రూం)ను పరిశీలించారు. కురుస్తున్న వర్షాలతో విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరు, స్థితిగతులను తనిఖీ చేశారు. ఎస్‌ఈ చాంబర్‌లో మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించాలన్నారు. వర్షాల విద్యుత్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌స్టేషన్లు, డీటీఆర్‌లు, విద్యుత్ లైన్లు, స్తంభాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎస్‌ఈ రమేశ్ బాబు, డీఈలు రాజం, పి.చంద్రమౌళి, ఎం.తిరుపతి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్, ఏడీలు పి.శ్రీనివాస్‌గౌడ్, లావణ్య, జి.శ్రీనివాస్, లావణ్య, ఎన్.అంజయ్య, జి.రఘు పాల్గొన్నారు.