
పేదల ఇళ్లు తొలగించొద్దు
● కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్
కరీంనగర్: లోయర్ మానేర్ డ్యామ్(ఎల్‌ఎండీ) కట్ట నుంచి 200 మీటర్ల దూరంలో నివాసాలు ఏర్పరుచుకున్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఇరిగేషన్‌శాఖ ఇచ్చిన నోటీసులు ఉపసహరించుకోవాలని, పేదల ఇళ్లు కూల్చితే రణరంగం తప్పదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్‌లోని 13వ డివిజన్ అస్తపురంకాలనీ, బతుకమ్మ కాలనీ వాసులకు నీటిపారుదలశాఖ అధికారులు ఐదు రోజుల క్రితం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుధవారం కాలనీల్లో పర్యటించారు. కాలనీవాసులు ఎమ్మెల్యే ఎదుట కన్నీంటి పర్యంతమయ్యారు. గత 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, పట్టాల్యాండ్‌లు ఇచ్చారని, ఇప్పుడు డ్యామ్ సేప్టీ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులు పంపడం ఏంటని బోరున విలపించారు. ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పేద కుటుంబాలపై ప్రభుత్వం ప్రతాపం చూపడం సరికాదన్నారు. నోటీసులు వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రుద్రరాజు, ఏవీ రమణ, మహేశ్ పాల్గొన్నారు.
ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియ
● నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగగరంలో రోడ్లు, ఫుట్‌పాత్ అక్రమణల తొలగింపు నిరంతరంగా కొనసాగించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణా ళిక విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేకుర్తి, బొమ్మకల్, సీతారాంపూర్, ఆరెపల్లి, అలుగునూరు, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, చింతకుంట విలీన డివిజన్లలో ప్రభుత్వ స్థలా లు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నా రు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డీటీఎఫ్‌కు రాయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 2500 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. నగరంలోని 17,18,19,38,39 డివిజన్లలో పర్యటించి విద్యానగర్‌లోని షట్టర్లలో 17,39 వార్డు కార్యాలయాలను వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. రేకుర్తి చెరువు సమీపంలోని డ్రైనేజీ కల్వర్టుకు మరమ్మతు పనులు చేసి చెరువులో నీళ్లు కలవకుండా మళ్లించాలన్నారు. హోర్డింగ్‌ల పన్నులు వసూలు చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు వేణు మాధవ్, ఖాదర్ మోహియోద్దీన్, డీసీపీ బషిరొద్దీన్, ఏసీపీలు వేణు, శ్రీధర్, టీిపీఎస్ తేజస్విని, సఽంధ్య పాల్గొన్నారు.
ఏజెంట్లను నియమించుకోవాలి
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు బూత్‌స్థాయిలో ఏజెంట్లను నియమించుకోవాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ సూచించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డబుల్, చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, అర్హులైన వారి ఓట్లు, కొత్త ఓట్ల నమోదుకు అడ్డంకులు సృష్టించొద్దంటూ పార్టీల ప్రతినిధులు కోరారు వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకునేలా కృషిచేయాలన్నారు.
ఆయుష్ ఆస్పత్రుల తనిఖీ
కరీంనగర్‌టౌన్: నగరంలోని రాంనగర్‌లో ఉన్న ఆయుర్వేదిక్, హోమియో ఆసుపత్రులను రాష్ట్ర ఆయుష్ అదనపు సంచాలకుడు డాక్టర్ పరమేశ్వర నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వైద్యులు, ఫార్మసిస్టులు, సిబ్బంది. సమయపాలన పాటించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందించాలని కోరారు. హోమి యో సీనియర్ వైద్యాధికారి శేఖర్, ఆయుర్వేద వైద్యాధికారి సదానందం, ఆయుష్ డీపీఎం ప్రవీణ్‌కుమార్, ఫార్మసిస్టులు రాజేశ్వర్, విజయేందర్ పాల్గొన్నారు.

పేదల ఇళ్లు తొలగించొద్దు

పేదల ఇళ్లు తొలగించొద్దు