
మొక్కమొక్కకూ ఎరువు
కూరగాయలు సాగుచేస్తున్న రైతులు తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారంరోజులుగా మారుతున్న వాతావరణంతో పంటలపై ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురియకపోవడంతో మొక్కలు ఎదగడం లేదని చెబుతున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శెడు, చర్లభూత్కర్, మొగ్ధుంపూర్‌లో మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. చర్లభూత్కూర్ శివారులో ఓ రైతులు బీరతోటను మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తుండగా.. మొక్కలు ఎదిగేందుకు గ్లాసుతో మొక్కమొక్కకూ ఔషధం అందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్