
అంజన్న సన్నిధిలో శ్రావణ సందడి
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి
ఆలయంలో శ్రావణ సందడి నెలకొంది. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. సామూహిక అభిషేకాలు చేసి, మొక్కులు
చెల్లించుకున్నారు. టికెట్లు, లడ్డూ విక్రయాల ద్వారా రూ.4.56లక్షల ఆదాయం
సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, సునీల్‌కుమార్,
చంద్రశేఖర్, హరిహరనాథ్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
సామూహిక అభిషేకాలు చేస్తున్న భక్తులు