
కొత్తబస్టాండ్‌లో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్‌లో గుర్తుతెలియని మృతదేహం కనిపించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వేములవాడ బస్ ప్లాట్‌ఫాం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన వ్యక్తి మృతదేహం ఉందని, బూడిద రంగు టీషర్ట్, తెల్లపంచ కట్టుకుని ఉన్నాడని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. అతని సమాచారం తెలిసినవారు 87126 56815నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శంకరపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రావ్య(27)కు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు శ్రేయాన్స్‌నందన్ ఉన్నాడు. ధర్మతేజ్ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య పుట్టింట్లో ఉంటోంది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ధర్మతేజ్ శ్రావ్యతో వీడియోకాల్‌లో మాట్లాడాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
మానసికవేదనతో ఒకరు..
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన బల్ల బాలయ్య(50) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె సంబంధిత ఆపరేషన్ సైతం జరిగింది. కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతూ.. మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
మెట్‌పల్లి: పట్టణంలోని దుబ్బవాడకు చెందిన చిన్నారి జెట్టి మాన్విక్‌పై మంగళవారం కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న మాన్విక్‌పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడికి పలుచోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతడిని మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లారు.

కొత్తబస్టాండ్‌లో గుర్తుతెలియని మృతదేహం