కరీంనగర్‌రూరల్: బొమ్మకల్‌లోని బిర్లా ఓపెన్‌మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 3వ తరగతి విద్యార్థి మరియం భాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రథమ బహుమతి సాధించినట్లు పీడీ సుంకరి మురళీధర్ తెలిపారు. ఈ నెల 3న స్వదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి ప్రథమ బహుమతి, రూ.10వేల నగదు గెలుచుకున్నట్లు వివరించారు. మంగళవారం విద్యార్థిని పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్ అభినందించారు.