
పర్యావరణాన్ని కాపాడాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నా రు. కొత్తపల్లిలోని రైతు వేదిక ఆవరణలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వన మహోత్సవంలో మొక్కనాటి నీరు పోశారు. కొత్తపల్లిలో ఖాళీ స్థలాలను గుర్తిస్తే ప్రకృతి వనాలు పెంచేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఆర్డీవో కందారపు మహేశ్వర్, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఏడిఏ రణ్‌ధీర్‌రెడ్డి, ఏవో మామిడి కృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
కరీంనగర్ నగరపాలక సంస్థ డివిజన్లలోని ప్రజలకు వార్డు ఆఫీసర్లు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. కొత్తపల్లి, చింతకుంటలలో మంగళవారం పర్యటించి, పలు సూచనలు చేశారు. నగర పాలక సంస్థలో విలీన డివిజన్లలో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా పర్యవేక్షించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, ఖాదర్ మోహియోద్దీన్ పాల్గొన్నారు.
‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్లేట్ ఫిరాయింపు’
కరీంనగర్‌టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంపై పార్టీ ముఖ్యనేతలు, ప్రోగ్రాం ఇన్‌చార్జీలతో మంగళవారం రేకుర్తి లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలే కాంగ్రెస్‌కు తగిన గుణ పాఠం చెప్తారన్నారు. యాదగిరి సునీల్ రావు, గుగ్గిల్లపు రమేశ్, కోమల ఆంజనేయులు, బంగారు రాజేంద్రప్రసాద్, మేకల ప్రభాకర్ యాదవ్, వాసాల రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తుల లక్ష్మీనారాయణ, మాడ వెంకటరెడ్డి, బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
‘ఆపద మిత్ర’ శిక్షణ విజయవంతం
కరీంనగర్ అర్బన్: విపత్తు సమయంలో ప్రజలను రక్షించేందుకు జిల్లాలో మూడు బ్యాచ్‌లుగా సుమారు 300 మందికి ‘ఆపదమిత్ర’ శిక్షణ ఇచ్చామని, రాష్ట్రంలో మొట్టమొదటగా జిల్లాలో శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్‌లో విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఆపదమిత్ర మూడో దఫా శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఆర్వో హాజరయ్యారు. జిల్లాలోని కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 300మంది వలంటీర్లకు మూడు దఫాలుగా 12 రోజులు శిక్షణ విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే విధంగా ఈ శిక్షణను ఇచ్చామని తెలిపారు. మెడికల్, ఫారెస్ట్, ఎకై ్సజ్, పోలీస్, సైబర్, ఫైర్, రూరల్, అగ్రికల్చర్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఆపదమిత్ర వలంటీర్లు పకడ్బందీ శిక్షణ పొందారని అన్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుతోపాటు డీటీఆర్ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.సుభాష్‌నగర్ ఫీడర్ పరిధిలోని సుభాష్‌నగర్, బుట్టిరాజారాంపల్లికాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
క్వింటాల్ పత్తి రూ.7,600
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ పత్తి రూ. 7,600 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

పర్యావరణాన్ని కాపాడాలి