
సూచిక బోర్డులు.. ప్రమాదాలకు నిలయాలు
ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేస్తున్న సూచికలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై కొత్తపల్లి వైద్య కళాశాల వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసిన స్టాఫర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల పేరిట రహదారిపై ఏర్పాటు చేసిన స్టాఫర్లకు రేడియం మెరుపులు లేకపోవడంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల నుంచి రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులకు స్టాఫర్లు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. స్టాఫర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని వాహనదారులు కోరుతున్నారు. – కొత్తపల్లి(కరీంనగర్)